సుశాంత్ జైలుకెళ్లేవాడు.. తాప్సీ కామెంట్స్ వైరల్

Taapsee says Sushant Singh World Alive He Will be Arrested

సుశాంత్ కేసులో ప్రస్తుతం ఎన్నో కోణాలున్నాయి. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ ఇలా ఎన్నో విబాగాలతో ముడిపడి ఉంది. ఇందులో ప్రస్తుతం డ్రగ్స్ కేసులో రియాను అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు. రియా అరెస్ట్ సుశాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తాప్సీ లెవనెత్తిన ఓ అంశం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Taapsee says Sushant Singh World Alive He Will be Arrested
Taapsee says Sushant Singh World Alive He Will be Arrested

రియా అరెస్ట్ అయింది. కానీ అది సుశాంత్ కేసులో కాదు. ఆమె డ్రగ్స్ వాడిందని, కొనుగోలు చేసిందని ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. దానికీ సుశాంత్ కేసుకు ఏం సంబంధం ఉందని ట్వీట్లు చేసింది. ఆమె డ్రగ్స్ వాడిందో లేదా సుశాంత్ కోసం తెచ్చిందో. ఒకవేళ సుశాంత్ బతికి ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు. ఆమె అతనిపై డ్రగ్స్‌ను ప్రయోగం చేసి ఉండొచ్చు.. సుశాంత్ ఆమెను బలవంత పెట్టొచ్చు అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

ఇక తాప్సీ కామెంట్లపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 2017 నుంచి డ్రగ్స్ డీలర్‌తో రియాకు సంబంధాలున్నాయని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. మరి 2019లో పరిచయమైన సుశాంత్ కోసం రియా డ్రగ్స్ అలవాటు చేసుకుందా? అని తాప్సీని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తాప్సీ చేసిన ట్వీట్లు సంచలనానికి దారి తీస్తున్నాయి.