S. V. Krishna Reddy : ఆర్గానిక్ మామ. హైబ్రిడ్ అల్లుడుగా రానున్న….ఎస్వి కృష్ణారెడ్డి….!

S.V. Krishna Reddy : ఉగాది,యమలీల,శుభలగ్నం వంటి ఎన్నో మంచి సినిమాలను తీసిన కృష్ణారెడ్డి గారు చాలా ఏళ్ల నుండి మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు.ఇక ఆ మధ్య 2014లో యమలీలా 2 సినిమా తీసిన అది పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక ఇపుడు మళ్ళీ సినిమా డైరెక్టర్ గా చేయబోతున్నారు ఎస్వి కృష్ణా రెడ్డి. ఎస్వి కృష్ణారెడ్డి కుటుంబం, వినోదం, మాస్‌ ఎలిమెంట్స్‌ను పక్కాగా మేళవించి సినిమాలు తీయడంలో దిట్ట అని చెప్పొచ్చు.

ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు’ అనే వైవిధ్యభరితమైన టైటిల్‌ను సినిమాకు ఖరారు చేశారు కూడా. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనన్య కథానాయికగా నటిస్తుండగా ఖుష్బూ, అలీ, సునీల్‌, వరుణ్‌సందేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు’ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఒకప్పుడు ఎస్వి కృష్ణా రెడ్డి సినిమా అంటే కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ మేళవించి అన్ని తరహాల ప్రేక్షకులను ఆకట్టుకునేవి. అయితే ఇపుడు ఆ తరహా సినిమాలను అందరిస్తారని నమ్మకం లేదు ప్రేక్షకులకు అభిరుచి మారిపోయింది. ఇక ఈ తరం కుర్రకారుకి నచ్చే కథాంశం తో సినిమా తీసి సక్సెస్ అవుతారమో చూడాలి మరీ.