గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న వెబ్‌ సిరీస్‌లో సుస్మితా సేన్‌

మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ఆర్య. రామ్‌ మాధ్వానీ దర్శకత్వం వహించాడు. డ్రగ్స్‌ మాఫియా చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీG హాట్‌స్టార్‌లో 2020లో విడుదలై ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ దక్కించుకుంది.

ఇక ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ నుంచి రెండు సీజన్లు రాగా.. మంచి రేటింగ్స్‌తో హాట్‌స్టార్‌లో టాప్‌ టెన్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దీనికి కొనసాగింపుగా ఆర్య 3 సీజన్‌ వస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ గమనిస్తే.. ఈ కొత్త సీజన్‌లో ఆర్య (సుస్మితా సేన్‌) డ్రగ్స్‌ మాఫియా నుంచి తన పిల్లలను, తనను రక్షించడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

తొలి సీజన్‌లో డ్రగ్స్‌ మాఫియాలో ఇరుక్కొని ఆమె భర్త చనిపోతాడు. ఇక మాఫియా నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం సుష్మిత చేసే ప్రయత్నాలు రెండో సీజన్‌లో చూడొచ్చు. ఇక మూడో సీజన్‌లో సుస్మితా అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదగనున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

ఇక మెదటి రెండు సీజన్లను వినోద్‌ రావత్‌ , సందీప్‌ మోడీ, కపిల్‌ శర్మ దర్శకత్వం వహించగా ఈ కొత్త సీజన్‌కు రామ్‌ మాధ్వానీ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నా ఈ సిరీస్‌లో సుస్మితా సేన్‌తో పాటు వికాస్‌ కుమార్‌, అంకుర్‌ భాటియా, సికందర్‌ ఖేర్‌, నమిత్‌ దాస్‌, మాయా సరావ్‌, సోహైలా కపూర్‌, జగదీష్‌ రాజ్‌పురోహిత్‌, విశ్వజీత్‌ ప్రధాన్‌ తదితరులు ప్రధాన పాత్రాలు పోషిస్తున్నారు.