Sushanth: వెబ్ సిరీస్ లో లక్ష్మీ సౌజన్య తో సుశాంత్..?

 

Sushanth: ప్రస్తుత టాలీవుడ్ స్టార్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. ఇటీవల నాగచైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర చేసిన పరంపర వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. ఈ వెబ్ సిరీస్ సంబంధించిన రెండు సీజన్లకు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ప్రస్తుతం ఈ బాటలోనే హీరో సుశాంత్ కూడా వెబ్ సిరీస్ లో చేయనున్నాడు.

జీ5 లో ప్రసారం కానున్న ఓ వెబ్ సిరిస్ లో ప్రధాన పాత్ర పోహిస్తున్నాడు సుశాంత్. సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇటీవల కాలంలో సుశాంత్ కేవలం హీరో పాత్ర నే కాకుండా, సినిమాకు సంబంధించిన కీలక పాత్రల లో కూడా నటించారు. అలా వైకుంఠపురం సినిమా తో అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శశాంత్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా సుశాంత్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

ప్రస్తుతం అయితే జి 5 లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ కి సంతకం కూడా చేశారట.”వరుడు కావలెను’ చిత్రంతో ఆకట్టుకున్న లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరిస్ కి దర్శకత్వం వహిస్తుంది.ఈ వెబ్ సిరిస్ ని ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.