సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఎన్నో మలుపులు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది ఆయన మరణం. సుశాంత్ సింగ్ అసలు ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది.
ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు సుశాంత్. డ్రిపెషన్ లో కూడా లేడు. సుశాంత్ చావుకు రియానే కారణం.. అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అంతకుముందే రియా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సుశాంత్ కు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం అని.. విలాసవంతమైన జీవితాన్ని సుశాంత్ గడిపేవాడని చెప్పుకొచ్చింది.
అలాగే తామిద్దరం పారిస్ పర్యటనకు వెళ్లామని… అలాగే మరోసారి సుశాంత్ తన బాయ్ ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ వెళ్లాడంటూ రియా వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే.. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారం లేస్తోంది. ఎందుకంటే.. సుశాంత్ బ్యాంకాక్ వెళ్లినప్పుడు అందరూ మగవాళ్లు మాత్రమే లేరని.. సుశాంత్ తో పాటు సారా అలీ ఖాన్ కూడా వెళ్లిందంటూ సుశాంత్ సన్నిహితులు ఓ లైవ్ షోలో వెల్లడించారు.
రియా అసలు.. సారా గురించి ఎందుకు దాచిపెట్టింది. ఆ విషయం రియాకు కూడా తెలుసు. సారా కూడా బ్యాంకాక్ పర్యటనకు సుశాంత్ వెళ్లిందని చెప్పుకుండా.. అందరూ మగవాళ్లే వెళ్లారంటూ రియా చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకాక్ లోని విలాసవంతమైన హోటల్ లో సుశాంత్, సారా అలీ ఖాన్ బస చేశారట. మూడు రోజుల పాటు హోటల్ లోనే ఉన్నారట. కనీసం బయటికి కూడా రాలేదట. సారా, సుశాంత్ ఇద్దరూ హోటల్ లోనే ఉంటే.. వాళ్లతో పాటు వెళ్లిన సుశాంత్ ఫ్రెండ్స్ బ్యాంకాక్ తిరగడానికి వెళ్లారట.
అయితే.. అదే సమయంలో థాయ్ లాండ్ లో సునామీ హెచ్చరికలు రావడంతో.. సుశాంత్, సారా అలీ ఖాన్ ఇద్దరూ బ్యాంకాక్ ట్రిప్ నుంచి ముంబై వచ్చేశారట. వాళ్లతో పాటు వెళ్లిన సుశాంత్ ప్రెండ్స్ మాత్రం బ్యాంకాక్ లోనే నెల రోజుల పాటు ఉన్నారట. బ్యాంకాక్ ఖర్చుల కోసం సుశాంతే వాళ్లకు డబ్బులు ఇచ్చాడంటూ సుశాంత్ తో పాటు బ్యాంకాక్ కు వెళ్లిన అతడి ఫ్రెండ్ సాబిర్ అహ్మద్ వెల్లడించారు.
అయితే.. ప్రస్తుతం రియా ఎందుకు ఈ ట్రిప్ లో సారా వెళ్లిన విషయాన్ని దాచింది అనే దానిపై చర్చ జరుగుతోంది. సారా వెళ్లిన విషయం తెలిసినా.. కావాలని ఆమె పేరును ఎందుకు చెప్పలేదు… అయినా సుశాంత్ బ్యాంకాక్ ట్రిప్ గురించి మీడియాకు ఎందుకు వెల్లడించింది.. అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావట్లేదు.