పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలు చేస్తున్న హీరోలందరూ ఇప్పుడు వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే తన త్రిపాత్రాభినయాన్ని నెగటివ్ షేడ్‌తో కూడిన పాత్రతో ముందుకు తీసుకువెళ్తుండగా, తాజాగా తమిళ స్టార్ సూర్య కూడా అదే రూట్‌లో ప్రయాణించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రంలో సూర్య హీరోగా, విలన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట.
గతంలో ‘24’లో సూర్య వేసిన ఆత్రేయ పాత్ర ఎంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా దానికి మించి వేరియేషన్స్ ఉన్న డ్యూయల్ రోల్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. సినిమాలో సూర్య గెటప్పులు, మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఊహించని స్థాయిలో డిఫరెంట్‌గా ఉంటాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో మమిత బైజు హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, సినిమా కథ 1980-90ల కాలం నడుమ తిరుగుతూ, పూర్తిగా విభిన్న శైలిలో సాగనుందని తెలుస్తోంది.
ఇటీవల ‘కంగువా’, ‘ రెట్రో’ లాంటి ప్రాజెక్టులతో నిరాశకు గురైన సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ సినిమా ద్వారా రీబౌన్స్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. అది ఫెయిల్ అయితే, ఇక వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ డ్యూయల్ రోల్ మూవీ మీదే పూర్తి ఆశలు ఉండనున్నాయి. వెంకీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇది సూర్య కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన సన్నిహితులకు చెబుతున్నట్లు టాక్. సూర్యకు దీర్ఘకాలంగా ఒక మాస్+క్లాస్ హిట్ అవసరమైంది. ఈ ప్రయోగాత్మక కథ దానికి పునాది వేస్తే ఆశ్చర్యం లేదు.