బాహుబలి సినిమాలో రోల్ కోసం సూర్యను సంప్రదించిన రాజమౌళి.. నో చెప్పిన సూర్య

Surya rejected rajamouli offer

అందరికీ తెలుసు. బాహుబలి సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందే. బాహుబలి సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలను సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటిన ఘనత బాహుబలి సినిమాది. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచానికి తెలిసింది కూడా అప్పుడే. విడుదలైన ప్రతి భాషలోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది సినిమా.

Surya rejected rajamouli offer
Surya rejected rajamouli offer

నిజం చెప్పాలంటే..తెలుగు సినిమాయే కాదు.. భారత దేశ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు బాహుబలిని ఢీకొట్టే సినిమా రాలేదు. అది ఎస్ ఎస్ రాజమౌళి గొప్పతనం.

నిజానికి బాహుబలి సినిమా రిలీజ్ కు ముందు అంతగా అంచనాలు లేవు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం.. ఆ తర్వాత వచ్చిన బాహుబలి2.. మొదటి చిత్రాన్ని మించి రావడంతో.. ఆ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అందుకే ఎస్ ఎస్ రాజమౌళితో ఒక్కసారైన కలిసి పనిచేయాలని కోరుకోని హీరో ఉండడు. కోరుకోని క్యారెక్ట్ ఆర్టిస్టు ఉండడు. ఆయన దర్శకత్వంలో ఒక్కసారైన నటించాలని క్యూలో ఉన్నవారు కోకొల్లలు.

కానీ.. అందరికి భిన్నంగా తమిళ్ హీరో సూర్య మాత్రం వెతుక్కుంటూ వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బాహుబలి సినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం హీరో సూర్యను రాజమౌళి సంప్రదిస్తే.. సింపుల్ గా సూర్య నో చెప్పాడట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సింగం హీరో.. అప్పుడు మంచి రోల్ మిస్ చేసుకున్నా.. కానీ ఇంకోసారి అటువంటి ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోను.. అంటూ చెప్పాడు సూర్య.

అప్పుడు ఏదో చిన్న రోల్ కదా అని నో చెప్పా. నిజానికి రాజమౌళి గ్రేట్ డైరెక్టరని అప్పటికే తెలుసు. కానీ.. నాకెందుకో అది చిన్న రోల్ అనిపించి నో చెప్పా. కానీ.. ఇకమీదట అలా చేయను. ఇక నుంచి ఎటువంటి చిన్న పాత్ర అయినా సరే రాజమౌళి సినిమాలో చేయడానికి నేను రెడీ..అంటూ ఓపెన్ అయ్యాడు సూర్య.