క్యూరియాసిటీ పెంచుతున్న సూర్య ‘కంగువ’

ప్రస్తుతం చాలావరకు హీరోలు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌పై ఫోకస్‌ పెడుతున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్స్‌ తెరకెక్కించే క్రమంలో బ్జడెట్‌ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్‌ అవ్వడం లేదు. అలాంటి హీరోల్లో సూర్య కూడా ఒకరు. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ‘కంగువ’నుంచి విడుదలయిన ప్రతీ గ్లింప్స్‌, పోస్టర్స్‌.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేశాయి.

ఇందులో సూర్య.. మునుపెన్నడూ కనిపించని అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్‌ ఎవరో తాజాగా రివీల్‌ చేశారు మేకర్స్‌. వివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువ’లో టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు సూర్య. ఇక తనను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ నటిస్తున్నట్టు మేకర్స్‌ తాజాగా రివీల్‌ చేశారు. జనవరి 27న బాబీ డియోల్‌ పుట్టినరోజు కావడంతో ‘కంగువ’లో విలన్‌ తానే అని చెబుతూ ఒక స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఇందులో బాబీ.. ఉధిరన్‌ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. హీరో సూర్య కూడా బాబీ డియోల్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ ఈ పోస్టర్‌ను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌ డే బాబీ డియోల్‌ బ్రదర్‌. మీ ఫ్రెండ్‌షిప్‌కు థాంక్యూ. ‘కంగువ’లో గొప్ప ఉధిరన్‌లాగా కనిపించడం కోసం మీ ట్రాన్ఫార్మేషన్‌ అదిరిపోయింది. ప్రేక్షకులందరూ ఆయన కోసం ఎదురుచూడండి’ అనే క్యాప్షన్‌తో లుక్‌ను ట్వీట్‌ చేశాడు సూర్య. ఈ సినిమా గురించి మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన ‘కంగువ’ గ్లింప్స్‌ వీడియో, పోస్టర్లు నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

మేకర్స్‌ ఇటీవలే పొంగళ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్‌ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్‌ కనిపిస్తున్నాయి. సూర్య మరోవైపు సెకండ్‌ లుక్‌లో ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తుండగా.. ఇంకోవైపు స్టైలిష్‌ లుక్‌లో మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ‘కంగువ’లో దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. బాబీడియోల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.

తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ అందించారు.. ఈ మూవీ 3డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. సూర్య కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్స్‌ అందించిన రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ కంగువ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తున్నాడు. కంగువ గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్‌ డేట్‌పై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.