ఆర్ ఆర్ ఆర్ నుంచి అదిరిపోయో అప్‌డేట్ వచ్చేసింది.. ఇది కదా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి కావాల్సింది..

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా 7 నెలల తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన కీలక సన్నివేశాలను మొదలు పెట్టారు. అంతేకాదు ముందుగా టీజర్ కి కావలసిన సోలో షాట్స్ ని చిత్రీకరిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా కొమరం భీమ్ టీజర్ రానుందని ఇటీవల రాజమౌళి హింట్ ఇచ్చారు.

Jr NTR First Look from Rajamouli RRR - tollywood

మెగా పవర్ స్టార్ రాం చరణ్ పాత్ర కి సంబంధించిన అల్లూరి సీతారామరాజు పాత్రని రివీల్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్ర ని రివీల్ చేస్తారో అని నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిందిందే. ఇందుకు సంబంధించిన తాజా అప్‌డేట్ దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న కొమరం భీం ఎప్పుడు రానున్నాడో వెల్లడించారు రాజమౌళి బృందం. ఈ నెల 22 న ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీం వీడియో టీజర్ రానుందని అధికారకంగా ప్రకటించారు.

Image

 

Image

 

Image

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.