పవన్ కళ్యాణ్ పంచన చేరిన సురేందర్ రెడ్డి.!

మామూలు షాక్ కాదు.! సూపర్ డూపర్ షాక్.! దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ‘ఏజెంట్’ రిజల్ట్ ఇది.! యంగ్ అక్కినేని బిక్కమొహం వెయ్యాల్సి వచ్చింది ‘ఏజెంట్’ పుణ్యమా అని.!

అయినా, ఈ సినిమా ఫెయిల్యూర్‌లో దర్శకుడిని పూర్తి బాధ్యుడిగా చూడటమూ సబబు కాదు.! కథ, కాకరకాయ్ లేకుండానే సినిమా మొదలెట్టి, పూర్తి చేసేశామని నిర్మాత స్వయంగా ఒప్పుకున్నాడాయె.!

సరే, ఆ సంగతి పక్కన పెడితే, చాలా అవమానాలు ఎదుర్కొన్న సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పంచన చేరాడట. పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో పవన్ సన్నిహితుడొకరు సినిమా నిర్మించ తలపెట్టారు గతంలోనే.

ఆ కాంబినేషన్‌కి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యేలా వుంది. కానీ, పవన్ కళ్యాణ్ దగ్గర అంత టైమ్ వుందా.? అదే మిలియన్ డాలర్ క్వశ్చన్. కానీ, పవన్ నమ్మితే.. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో.!