టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి పునాదిరాళ్లు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇలా ఒక్కొక్క సినిమాలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు అతి తక్కువ కాలంలో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మెగాస్టార్ నటన, ఆయన చేసే డాన్స్ కి ఎవ్వరూ సాటిరారు అనటంలో సందేహం లేదు. అయితే కొంతకాలం సినిమాలకూ విరామం ఇచ్చిన చిరంజీవి రాజకీయాలలో కూడ రాణించారు. సొంతంగా పార్టీ కూడ స్థాపించాడు. కానీ కొంతకాలానికి ఆ పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు.
మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో బిజిగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఇటీవల చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగాస్టా ర్ చేసే ఒక పని వల్ల ఆయన భార్య సురేఖ చిరంజీవి పై కోపగించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎప్పుడూ షూటింగ్ పనులలో బిజిగా ఉండే చిరంజీవి పని ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయడని, చిరంజీవిలో ఆ ఒక్క విషయం సురేఖకి నచ్చదని తెలుస్తోంది.
షూటింగ్ లో ఉన్నపుడు సమయం కుదరకపోవటంతో సమయానికి భోజనం చేయని చిరంజీవి ఇంట్లో ఉన్నా కూడా సమయానికి భోజనం చేయకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారని, ఆ విషయంలో చాలాసార్లు సురేఖ చిరంజీవి మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి కరోనా బారిన పడినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి సురేఖ చాలా కంగారు పడినట్లు తెలుస్తోంది. అయితే కరోనా నుండి బయటపడి చిరంజీవి మళ్ళీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.