మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్. ఈ సినిమాకి వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నాడట. అలాగే మెహర్ రమేష్ సినిమాలో నటించబోతున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం రీమేక్ లో మెగాస్టార్ నటించబోతుండగా ఈ సినిమా కి మెహర్ రమేష్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడట. వాస్తవంగా మెగాస్టార్ తనయుడు రాం చరణ్ ..తండ్రికోసమే కొణిదెల ప్రొడక్షన్స్ ని స్థాపించాడు. చిరంజీవి నటించే సినిమాలన్ని సొంత బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తాడని స్వయంగా ప్రకటించాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం చిరు – మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకోసం ఇన్‌డైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన అనిల్ సుంకర నిర్మిస్తాడని సమాచారం. అంతేకాదు మహేష్ కూడా తన సొంత నిర్మాణ సంస్థ జీ.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తను నటించే సినిమాలకి భాగ స్వామిగా ఉంటున్నాడు. అలాగే మెగాస్టార్ సినిమాకి పార్ట్‌నర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం.