సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓ సూపర్ అప్డేట్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మరియు సాలిడ్ కాంబినేషన్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అయితే చేస్తున్న చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ కాంబినేషన్ పై మాస్ క్రేజ్ నెలకొనగా ఈ సినిమాతో ఎన్నో చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ బయ్యర్లు మాత్రం రికార్డు ధర ఈ చిత్రానికి అందిస్తున్నారు.

కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మొట్ట మొదటి పాటని అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అంతా ఎగ్జైటింగ్ గా మారగా దీనిపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ అందించలేదు. కాగా ఇపుడు అయితే ఈ అవైటెడ్ ఫస్ట్ సాంగ్ పై నిర్మాత నాగవంశీ ఒక అఫీషియల్ అప్డేట్ ని అందించాడు.

తాను రీసెంట్ గా ఇచ్చిన ప్రెస్ మీట్ లో గుంటూరు కారం మొదటి సాంగ్ రెడీ అయిపోయింది అని దీనిపై అప్డేట్ ని దసరా కానుకగా అందించి సాంగ్ ని కూడా ఇదే నెలలో విడుదల చేస్తున్నట్టుగా ఓ సూపర్ అప్డేట్ ని అయితే అందించారు. దీనితో చాలా రోజులు నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ని కోరుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ అయ్యే వార్తే అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.