సరిలేరు నాకెవ్వరూ అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు దూసుకుపోతున్నారు. వరుస హిట్లతో మాంచి జోరుమీదున్నారు. సినిమాల మధ్య గ్యాప్ వస్తున్నా.. ఆ గ్యాప్ కు తగ్గట్టే బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందిస్తున్నాడు మహేశ్ బాబు.
కథల ఎంపికలోనూ మహేశ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత ఏకంగా ఐదు నెలల పాటు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత కొత్త సినిమా సర్కారు వారి పాటను ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించారు కానీ.. సెట్స్ మీదికైతే ఈ సినిమా ఇంకా వెళ్లలేదు.
మొన్ననే.. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ తోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అని తెలిసిపోయింది. మహేశ్ బాబు అభిమానులు సినిమా మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేసుకున్నారు.
కాస్త కరోనా తగ్గుముఖం పడితే కానీ.. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక..ఈ సినిమా స్టోరీ కూడా అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తిచూపే విధంగా సినిమా ఉంటుందట.
అయితే.. తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన మరో అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారట. రెండు పాత్రల్లో ప్రిన్స్ మెరవనున్నారంటే.. ఆ సినిమా ఇక సూపర్ డూపర్ హిట్టే అన్నమాట.
ఒక క్యారెక్టర్ లో బ్యాంకు ఆఫీసర్ గా నటించనుండగా… మరో పాత్రలో పాన్ బ్రోకర్ గా మహేశ్ కనిపించబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఇదే రచ్చ.
ఇక.. బ్యాంకు ఆఫీసర్ కొడుకుగా… బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తి చూపడం అయితే… పాన్ బ్రోకర్ గా గోల్డ్ స్మగ్లింగ్ దందాను ఆపడం మరో పాత్ర స్టోరీ అని తెలుస్తోంది.
ఇక.. పాన్ బ్రోకర్ పాత్ర మాత్రం పోకిరిలో మహేశ్ బాబు పాత్రను పోలి ఉంటుందట. ఇక.. ఈ సినిమాలో మహేశ్ పాత్రల్లో ఓ పాత్రకు కీర్తి సురేశ్ జోడి కట్టనుండగా.. మరో హీరోయిన్ కోసం మూవీ యూనిట్ సెర్చ్ చేస్తోందట. మొత్తానికి మహేశ్ డ్యుయల్ రోల్ లో నటిస్తుండటంతో మహేశ్ ఫ్యాన్స్ కూడా ఫుల్లు ఖుషీ అవుతున్నారు. సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే.. సూపర్ డూపర్ హిట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.