సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో పాటు కాసింత అందం కూడా ఉండాలి. రెండు ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలం. అందులోనూ ఇక్కడ నెట్టుకురావాలంటే వారసత్వం లాంటివి కూడా సరిపోవు. బ్యాక్ గ్రౌండ్ ఉండగానే సరిపోదు. దానికి తగినంత శ్రమ ఉండాలి. లేదంటే ఊరికనే తేలిపోతారు.
దానికి మన ఇండస్ట్రీలోనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతోమంది స్టార్ల వారసులు ఇండస్ట్రీకి వచ్చి తమను తాము నిరూపించుకోలేక అన్నీ సర్దుకొని వెళ్లిపోయారు. దేనికైనా ప్రతిభతో పాటు అందం అనేది చాలా ముఖ్యం. అందం ఉన్నా కూడా ప్రతిభ లేకపోతే వేస్ట్.
ఇప్పుడు ఈ సొల్లు అంతా ఎందుకంటే.. మన ప్రిన్స్ ఉన్నాడు కదా. అదేనండి.. మహేశ్ బాబు. ఆయన గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది. సూపర్ స్టార్ కృష్ణ కు ఇద్దరు కొడుకులు. రమేశ్ బాబు, మహేశ్ బాబు. కానీ.. రమేశ్ బాబు ఏమయ్యాడు.. మహేశ్ బాబు ఏమయ్యాడు. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. మహేశ్ బాబు హీరో అయ్యాడు. రమేశ్ బాబు ఏమయ్యాడో తెలియదు.
అందుకే ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంత శ్రమించాలి. అది మహేశ్ బాబు చేశాడు. సక్సెస్ అయ్యాడు. నేడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో పొజిషన్ లో ఉన్నాడు. తండ్రి సూపర్ స్టార్ టాగ్ ను ఫ్యాన్స్ మహేశ్ కు ఇచ్చేశారు.
సూపర్ స్టార్ కంటే ముందు మహేశ్ ను తన ఫ్యాన్స్ అంతా ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునేవారు. ప్రిన్స్ అంటే రాకుమారుడు. ఏదో ఊరికే మహేశ్ కు ఆ బిరుదు రాలేదు.
ఎందుకంటే.. మహేశ్ బాబు నిజంగానే ప్రిన్స్ లా ఉంటాడు కాబట్టి. సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేశ్ బాబుకు సంబంధించిన చిన్నప్పటి ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. సూటు బూటు వేసుకొని అచ్చం రాకుమారుడిలా ఉన్నాడు బుజ్జి మహేశ్ బాబు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక మహేశ్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా? చూశారు కదా. మా ప్రిన్స్ చిన్నప్పుడే ప్రిన్స్ లా ఉన్నాడు. ఆయనకు ప్రిన్స్ అనే బిరుదు ఊరికే రాలేదు. ఈ ఫోటో చూస్తేనే తెలుస్తుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిజమే ఈ ఫోటో చూస్తుంటే మహేశ్ ను ప్రిన్స్ కాదు.. అంతకంటే ఎక్కువే అనాలి.. అబ్బ.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో..