మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడంటున్న కృష్ణ..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తన వారసత్వాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా మంచి గుర్తింపు అందించాడు. ఇక అందులో మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ పొజిషన్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణ తన కూతురు మంజుల చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు తెలిపాడు.

ఇక మంజుల తన తండ్రిని మహేష్ ను చిన్నప్పుడు సూపర్ స్టార్ ను చేసేశారు. అది మీరు ముందే ప్లాన్ చేసుకొని చేసిందా లేక అలా జరిగిందా అని అడగటంతో.. అలా జరిగిపోయిందని అన్నాడు. చిన్నప్పుడు ఒకరోజు మహేష్ ను తను షూటింగ్ తీసుకెళ్లాడట. సెట్లో షూటింగ్ జరుగుతుంటే.. ఎక్కడో ఒక మూల మెట్లు ఉంటే వాటి మీద గడ్డం కింద చెయ్యి పట్టుకొని కూర్చొని చేస్తున్నాడట. దీంతో తాను వెళ్లి నటిస్తావా.. నేను చేయను నేను చేయను అంటూ మారాం చేశాడట. నువ్వు చేస్తావా చేయవా అని గట్టిగా అనేసరికి స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడట మహేష్.