పోర్న్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం వాటికి దూరంగానే ఉంటుంది. భారత సినీ రంగంలోకి అడుగుపెట్టి శృంగార ప్రపంచాన్ని వీడింది. ప్రస్తుతం బాలీవుడ్, దక్షిణాది చిత్రాలను చేసుకుంటూ వెండితెరపై దూసుకువెళ్తోంది. సన్నీ లియోన్ ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. సన్నీ తన భర్త డానీయల్ వెబర్, పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. దత్తత పిల్లలైనా సరే కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటూ మాతృప్రేమను పంచుతోంది.
పిల్లలకు మంచి విషయాలు నేర్పుతూ తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఈ మధ్యనే దత్త కుమార్తె నిషాకు మూడేళ్లు నిండడంతో సన్నీ లియోను సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. చూస్తుండగానే మూడేళ్లు గడిచాయని, నిషా వచ్చాకే ప్రేమ అంటే ఏంటో అర్థమైందని కూతురిపై ప్రేమను చాటుకుంది. ఇక తాజాగా తన కుటుంబంతో సహా ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలను పిల్లలకు నేర్పించింది.
ఇక తాజాగా సన్నీ లియోన్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన భర్త హాయిగా నిద్రిస్తున్నాడు. అయితే ఆమె మాత్రం ఓ ప్రాంక్ వీడియో చేసింది. ఘాడ నిద్రలో ఉన్న భర్త ప్రేవేట్ పార్ట్ వద్ద ఓ నీటితో నింపిన బెలూన్ను పెట్టింది. దాన్ని గుండుపిన్నుతో గుచ్చేయడంతో బెలూన్ పగిలి.. బయటకు వచ్చిన నీరు డానియర్ ప్రైవేట్ పార్ట్స్‌ను తడిపాయి. దీంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొనేసరికి.. అక్కడ సన్నీ లియోన్ ఫక్కున నవ్వుకుంటూ కనిపించింది. ఇలా ఫ్రాంక్స్ చేయడం అతనికి ఇష్టమని సన్నీ లియోన్ పేర్కొంది.