వారమంతా బిజీ బిజీ ఉద్యోగ జీవితంలో గరిపిన వారు.. ఆనందంగా కుటుంబంతో గడిపే రోజు ఆదివారం. వారం రోజులు ఆఫీస్, పని, చదువు లో బిజీగా గడిపి, కాస్త సేదతీరేందుకు ఆదివారంనే సరైనది అనుకుంటారు. అందుకే ఆదివారం నాడుకట్టింగ్ చేయాలి, షేవింగ్ చేయించుకోవాలి.. బయటికి వెళ్ళాలి… ఇలా చాలా పనుల్ని ఆ రోజు ప్లాన్ చేస్తుంటారు. కానీ పెద్దలు చెబుతున్న మాట ఒక్కసారి వింటే ఈ అలవాట్లు మార్చుకోవాలనిపిస్తుంది.
మనకు ఆదివారం సెలవు ఇవ్వడంలో బ్రిటిష్ చరిత్ర ఉంది. వాళ్లు ఉద్యోగులు, పనివాళ్లకు వారం రోజులు పనిచేయించి, ఒక రోజు రిలాక్స్ అవ్వటానికి ఈ కాన్సెప్ట్ తెచ్చారు. అది మనం ఇంకా కొనసాగిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా ఆదివారం అంటే కేవలం రిలాక్స్‌కి కాదు. సూర్యుని రోజు. మనకు కనిపించే దేవుడు సూర్యుడు అని పండితులు చెబుతుంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు… అని కొంత మంది అడుగుతుంటారు. అప్పుడు ఉదయించే సూర్యునే చూపిస్తారు పెద్దలు. మనం చేసే ప్రతిపని పంచభూతాలకూ, కర్మకీ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుందని అంటారు.
అందుకే ఆదివారంరోజు కొన్ని పనులు చేయకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున కటింగ్‌లు, షేవింగ్‌లు చేయకూడదు. గోర్లు కూడా తీసుకోకూడదు. మద్య మాంసాలు తినకూడదు. సంభోగం వంటి విషయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనలోని శుద్ధతను దెబ్బతీస్తాయట. అందువల్ల ఆ పనులను సోమవారం, బుధవారం, గురువారం వంటి రోజుల్లో చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
సూర్యుడు నమస్కార ప్రియుడు. రెండు చేతులు పైకి ఎత్తి, తల వంచి నమస్కరిస్తే మనలో దుష్టబుద్ధి, చెడు ఆలోచనలు తొలగిపోతాయని పెద్దలు అంటున్నారు. కర్మ ఎప్పటికీ వదలదని, మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం తప్పకుండా పొందుతామని చెబుతున్నారు. అందుకే ప్రతి ఆదివారం సూర్యుని నమస్కరించి, పాజిటివ్‌గా ఉండడం మంచిదని పండితుల సలహా. సెలవు రోజు కాబట్టి ఏ పని చేయాలి అన్న బదులు, ఏ పని చేయకూడదు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి.