అతన్ని ఎలిమినేట్ చేయటంతో గుక్క పట్టి ఏడ్చిన సోహైల్,ఆదివారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్

sunday bigg boss episode highlights

బిగ్ బాస్:సన్‌డే అంటే ఫన్‌డే. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి సభ్యులతో సరదాగా ఆటలు ఆడిస్తారు నాగార్జున. ఈ ఆదివారం కూడా ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్ పంచారు. ఈ క్రమంలోనే నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా అరియానాను బిగ్ బాస్ సేవ్ చేశారు. ఆ తరవాత గంట మోగించి మోనాల్‌ను కాపాడారు. అనంతరం లాస్యతో కొబ్బరికాయ కొట్టించి హారికను సేవ్ చేశారు. ఇక చివరిగా స్నేహితులు సోహైల్ , మెహబూబ్‌లను రెండు పెద్ద బల్బుల వద్ద నిలబెట్టి మెహబూబ్‌కు ఎర్ర రంగు బల్బు వేసి ఎలిమినేట్ చేశారు.

mehaboob eliminated from bigg boss house this sunday
mehaboob eliminated from bigg boss house this sunday

మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే ఇంటిలో వాతావరణం మారిపోయింది. కన్నీటి వరద పారింది. ఇప్పటి వరకు ఏ ఎలిమినేషన్‌కు చూడని విధంగా ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. సోహైల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ హౌస్ నుంచి వెళ్లిపోతుంటే సోహైల్ తట్టుకోలేకపోయాడు. బోరున విలపించాడు. ఆ ఏడుపు మామూలుగా లేదు.. పీక్స్. అతన్ని చూసి మెహబూబ్ కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. వీరిద్దరే కాదు.. అఖిల్ కూడా బాగా ఏడ్చాడు. హారిక, మోనాల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తం మీద ఆదివారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ముగిసింది. మెహబూబ్ వెళ్తూ బిగ్ బాంబును అవినాష్‌పై వేశాడు. ఇది కూడా అవినాష్ మీద ఇష్టంతోనే. ఒక వారం అవినాష్ గుడ్డుతో సహా నాన్ వెజ్ తినకూడదు.