Hero Suman: మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుమన్… ఆ టాలెంట్ అతనికి మాత్రమే ఉంది?

Hero Suman:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకనొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి సుమన్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండేది. చిరంజీవితో పాటు సమానంగా సుమన్ సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్దా సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేవారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ కెరీర్ ఇబ్బందులలో పడి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. చిరంజీవి మాత్రం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న చిరంజీవి గురించి హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ మాట్లాడుతూ నటనపరంగా తనకు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు.ఇక డాన్స్ విషయానికి వస్తే చిరంజీవి డాన్స్ అంటే ఇష్టమని ఆయన ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారని సుమన్ వెల్లడించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేల వైపు చూడకుండా చేసే సత్తా మెగాస్టార్ కి మాత్రమే ఉంది. ఆయన డాన్స్ లో ఒక రిథమ్ ఉందంటూ ఈయన వెల్లడించారు.ప్రస్తుత కాలంలో ఉన్న యంగ్ హీరోలు కూడా చాలా ఫాస్ట్ గా డ్యాన్స్ చేస్తున్నప్పటికీ, ఆ డాన్స్ లో నాకు జిమ్నాస్టిక్ కనబడుతుందని ఈయన కామెంట్ చేశారు.

ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ డాన్స్ కూడా తనకు చాలా బాగా నచ్చుతుందని సుమన్ వెల్లడించారు. ఆయన డాన్స్ చేసిన అతని డాన్స్ లో కూడా ఒక రిథమ్ ఉంటుందని సుమన్ మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోని వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి సుమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సుమన్ ఇండస్ట్రీ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.