Sukumar: ఆ సినిమాతో నా కెరియర్ మొత్తం ముగిసిపోయింది… సుకుమార్ సంచలన వ్యాఖ్యలు!

Sukumar: ప్రస్తుతం ఉన్నటువంటి దర్శకులలో సీనియర్ స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్ ఒకరు. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత తదుపరి చిత్రం రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే .ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తిరిగి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు.

ఇలా సుకుమార్ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే అందరికీ సినిమాల మాదిరిగానే సుకుమార్ డైరెక్షన్లో కూడా వచ్చిన సినిమాలు కొన్ని మంచి సక్సెస్ అందుకోగా మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఘోరంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమా పూర్తిస్థాయిలో కలెక్షన్లను రాబట్టడంలో విఫలమైంది అలాంటి సమయంలో సుకుమార్ ఇక తన కెరియర్ ముగిసిపోయిందని ఎంతో భయపడ్డారట. కానీ యూఎస్ కలెక్షన్లు మాత్రం ఈ సినిమా నుంచి తనని బయటపడేసాయని సుకుమార్ తెలిపారు.

రీసెంట్‌గా సుకుమార్ .. గ్లోబల్ స్టార్, తన రంగస్థలం హీరో రామ్ చరణ్ చేసిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా యూఎస్ ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమాని కనుక చూడకపోతే ఈ సినిమాతోనే నా కెరియర్ పూర్తి అయి ఉండేది అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ డైరెక్టర్గా కూడా ఈయన గుర్తింపు పొందారు.