డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషలలో పుష్ప 2 సినిమా విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దేశం మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు మూవీ టీం. అందులో భాగంగా డిసెంబర్ 2న హైదరాబాద్ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో సోమవారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మూవీ టీం. అయితే ఈవెంట్ మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. ముఖ్యంగా సుకుమార్, అల్లు అర్జున్ సుకుమార్ భార్య తబిత అందరూ భావోద్వేగానికి లోనయ్యారు.
పుష్ప 2 ది రూల్ దాదాపు మూడేళ్లు తీశారు. పుష్ప వన్, టు సిరీస్ కి కలిపి దాదాపు 5 ఏళ్ళు సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పని చేశారు అలాగే సినీ పరిశ్రమలో వారి ప్రయాణం కూడా దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తలుచుకొని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇదే వేడుకలో సుకుమార్ సినిమా వర్కింగ్ స్టిల్స్ తో పాటు అల్లు అర్జున్ తో ఉన్న అనుబంధాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను, తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తున్నాను. పుష్ప అనే సినిమా ఎలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బన్నీకి ఉన్న బాండింగ్ మాత్రమే. బన్నీ ఒక సీన్ కోసం, ఒక సాంగ్ కోసం, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను.
నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర కథ కూడా పూర్తిగా లేదు. నీకు కేవలం క్యారెక్టర్ గురించి కొన్ని సీన్స్ గురించి మాత్రమే చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు లవ్ యూ బన్నీ అంటూ ఎమోషనల్ అయిపోయాడు. మాటలకి అల్లు అర్జున్, సుకుమార్ భార్య తబిత కూడా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు.