ఒక బిగ్ బడ్జెట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడం ఒక యుద్ధమైతే ఆ సినిమాను పూర్తి చేసి థియేటర్స్ వరకు తీసుకురావడం మరొక పెద్ద యుద్ధం. ఈ వార్ ను ఎదుర్కోవడం కొంతమంది దర్శకులకు కత్తిమీద సాము లాంటిది. కాస్త తేడా కొట్టినా రిజల్ట్ లో తేడా వస్తుంది. ఇక సుకుమార్ సంగతి తెలిసి కూడా ఇటీవల పుష్ప నిర్మాతల అడ్వాన్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సుకుమార్ ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు అంటే అంత ఈజీగా అనుకున్న సమయానికి విడుదల చెయ్యలేడు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లాంటి పుష్ప సినిమాను ఇంకా ఎన్ని రోజులు తీస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ. కూడా సినిమా షూటింగ్ కనీసం 30శాతం కూడా పూర్తవ్వలేదట.
అంటే ఇంకా సగానికి పైగా మిగిలి ఉంది. కానీ అవేమి పట్టించుకోకుండా నిర్మాతలు హీరో కలిసి పుష్ప రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయించారు. పుష్ప ఆగస్టు 13న రానున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ మిగిలిన ఐదు నెలల్లో పుష్ప షూటింగ్ ను సుకుమార్ పూర్తి చేస్తాడా లేడా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో ఆయన ఏ సినిమా కూడా ఇంత వేగంగా పూర్తయినట్లు లేదు. మరి సుకుమార్ ఏ విదంగా ఆలోచిస్తారో చూడాలి.