సుకుమార్.. దసరాను ఎందుకు పట్టించుకోవట్లే?

దర్శకుడు సుకుమార్ దగ్గర ఎవరైనా సహాయక దర్శకుడిగా ఛాన్స్ కొట్టేస్తే చాలు వారు తప్పకుండా టాలెంటెడ్ అని ఒక గుర్తింపు వస్తుంది. సుకుమార్ కూడా తన దగ్గర వర్క్ చేసేవారు మరో స్థాయికి వెళ్ళాలి అని శిష్యులకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఉదాహరణకు బుచ్చిబాబు సంగతి చూసుకుంటే ఉప్పెన సినిమా కథ రాసుకున్న దగ్గర నుంచి కూడా అతనికి ఎంతగానో సపోర్ట్ చేశాడు. ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు.

కానీ దసరా విషయంలో మాత్రం సుకుమార్ కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ కేవలం సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో సినిమాకు మాత్రమే వర్క్ చేశాడు. ఆ తర్వాత 2018లో నానికి దసరా కథను చెప్పి అతని వెంటే తిరుగుతున్నాడు. మొత్తానికి సినిమా విడుదలయ్యింది.

అయితే సినిమా లాంచ్ అప్పుడు పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సుకుమారు మళ్ళీ ఎక్కడ దసరా ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇప్పుడు సినిమా కాస్త మంచి టాక్ అందుకున్న సమయంలో సుకుమార్ యూనిట్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్నారు అనుకుంటే పరవాలేదు కానీ అసలు దసరా సినిమా గురించి చిన్న బైట్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. మరి ఎందుకు సుకుమార్ దసరా సినిమాకు కాస్త దూరంగా ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి పుష్ప షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత అయినా శిష్యుడిని కలుస్తారో లేదో చూడాలి.