సుకుమార్ రాస్తే – కొరటాల డైరెక్షన్ చేస్తే – అబ్బబ్బ అరుపులే…!

సుకుమార్.. కొరటాల శివ .. ఇద్దరు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్. ఇద్దరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇద్దరు ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సుకుమార్ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఇంతకాలం స్టైలిష్ స్టార్ గా చూసిన అల్లు అర్జున్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు సుకుమార్. ఎంత మాస్ అంటే లారీ డ్రైవర్ క్యారెక్టర్ అన్న మాట. అల్లు అర్జున్ కెరీర్ లో ఇంత ఊర మాస్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు.

ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా తయారవుతోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ ని కొరటాల శివ దాదాపు 25 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాడో అలా చూపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడో అర్థమైంది. ఇక ఆచార్య మే 13 న రిలీజ్ కానుండగా.. పుష్ప ఆగస్టు 13 న రిలీజ్ కానుంది.

కాగా రీసెంట్ గా సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఉప్పెన సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ గెస్ట్ గా వచ్చారు. అలాగే పలువురు టాలీవుడ్ దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడు సుకుమార్ టాలెంట్ ని ఆయన కొత్త వారికి కల్పించే అవకాశాల గురించి పొగడ్తలతో ముంచేశారు. అంతేకాదు సుకుమార్ నిర్మాణంలో దర్శకుడిగా ఒక సినిమా చేయాలని ఉందన్న కోరికను బయట పెట్టాడు కొరటాల. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చేస్తుందన్న టాక్ ఇప్పటి నుంచే మొదలైంది.