సుకుమార్ లెక్కల మాష్టర్ అన్న సంగతి తెలిసిందే. సుక్కు లాజిక్కులు ఎలా ఉంటాయో ఆయన సినిమాలను చూస్తూనే తెలుస్తుంది. సుకుమార్ చెప్పే మాటలు, రాసే డైలాగ్‌లు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి సుకుమార్ స్టార్ మాలో ప్రసారమైన 100 పర్సెంట్ లవ్ ప్రోగ్రాంలో ప్రేమ, పెళ్లి అంటూ కొన్ని అర్థాలు చెప్పాడు. తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కూడా బయటకు చెప్పేశాడు. ఆర్య, 100 పర్సెంట్ లవ్ సినిమాలో వాడిన పదాల గురించి వివరించాడు.
ప్రపంచంలో అందరూ వన్ సైడ్ లవర్స్ ఉంటారని, అవతలి వారు స్పందిస్తుంటారు.. దాన్ని ప్రేమ అనుకుంటామని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఆర్యలో ఫీల్ మై లవ్ గురించి చెబుతూ… ప్రేమించడం అనేది మనకు సంబంధించిన విషయం అని.. అమ్మాయికు సంబంధం లేదు.. కనీసం నేను ప్రేమిస్తున్నాను అని గుర్తించు అని చెప్పడమే.. ఫీల్ మై లవ్ అని సుకుమార్ వివరించాడు. ఇన్‌ఫాచ్యువేషన్ అంటే ఎప్పటికీ వివరించలేమని.. అదొక అట్రాక్షన్‌లాంటిదని చెప్పుకొచ్చాడు.
ఇక తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని సుకుమార్ బయటకు చెప్పేశాడు. తన భార్య (తబిత) ఫ్రెండ్ ఆటోగ్రాఫ్ కోసం వస్తే.. తాను మాత్రం ఆమె ఫోన్ నంబర్ అడిగానని, అలా తబితతో చాటింగ్ చేయాలని ఆమె నంబర్ అడిగాను. అలా మొదలైందంటూ అసలు గుట్టు విప్పేశాడు. తానే మొదటగా ప్రపోజ్ చేశానని అలా పెళ్లి వరకు వచ్చిందని చెప్పుకొచ్చాడు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే.