సుధీర్ బాబు విలనిజం.!

సుధీర్ బాబు మంచి నటుడు.. అనే విషయం కెరీర్ మొదట్లోనే తెలిసిపోయింది. కంటెంట్ రిచ్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాడు మొదట్నుంచీ సుధీర్ బాబు. అందుకే విలక్షణ నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లోనే బాలీవుడ్‌లో తన విలనిజాన్ని పరిచయం చేశాడు సుధీర్ బాబు.

టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘీ’ సినిమాలో సుధీర్ బాబు విలన్‌గా నటించి మెప్పించాడు. తాజాగా మరోసారి తన విలనిజం ప్రదర్శించబోతున్నాడట సుధీర్ బాబు. ఈ సారి తెలుగులోనూ తన ప్రతాపం చూపించబోతున్నాడట. ఆ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్. కాగా, ఈ మధ్య సుధీర్ బాబు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశ పరుస్తున్నాయ్.

ఇటీవలే ‘హంట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్ బాబు, త్వరలో ‘మామా మశ్చీంద్ర’, ‘హరోం హర’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.