సుదీప్ మెచ్చిన తెలుగు హీరో స్టార్ ఎవరంటే ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీ నటీనటులు కూడా బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. బాషాభేదం లేకుండా ఆడియెన్స్ కూడా ప్రతిభ ఉన్న నటులని భాగానే లైక్ చేస్తున్నారు.

సుదీప్ రక్త చరిత్ర, ఈగ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి , సైరా వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా నటించాడు. సుదీప్ కి ప్రస్తుతం తెలుగు లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

ఇకపోతే ,తాజాగా సుదీప్ ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ఆన్లైన్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఆ చిట్ చాట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ , ప్రభాస్, ఎన్టీఆర్ , మెగాస్టార్ లలో మీరు మెచ్చిన హీరో ఎవరు అని అడిగితే , ఏ మాత్రం సంకోచ పడకుండా ఎన్టీఆర్ అంటూ చెప్పాడు. అయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ , అలాగే ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో తారక్ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు. పక్కవారిని చాలా బాగా గౌరవిస్తాడు అని చెప్పాడు. ఇక నేను మెగాస్టార్ గారితో పని చేశాను అయన గురించి తెలుసు. అలాగే ప్రభాస్ , మహేష్ స్టార్ ఇమేజ్ మరో లెవెల్ లో ఉంది. అయితే ఎన్టీఆర్ లో నాకు నచ్చేది ఎప్పుడు కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉండటమే అని , ప్రతి క్షణం కూడా ఇంకా ఏమీ చేయాలని ఆలోచిస్తుంటాడు. నేను ఎన్టీఆర్ ను సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్లోనే చూశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాడు అని ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా వర్ణించాడు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తాజాగా విడుదలైన ఎన్టీఆర్ కొమరం భీం ట్రైలర్ ను చూసారా అని అడగ్గా … చూసాను , చాలా బాగుంది. ఎన్టీఆర్ సూపర్ గా చేసారు అని చెప్పాడు. చబ్బీ చబ్బీ గా ఉండే ఎన్టీఆర్ నిరంతరం నేర్చుకుంటూ ఈ రోజు ఇంతటి స్థాయికి ఎదిగాడు అంటూ సుదీప్ తెలిపాడు.