పని పాట లేని వల్లే సెలబ్రిటీల గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తారు: వరలక్ష్మి శరత్ కుమార్

ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈమె తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈమె సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా గురించి సెలబ్రిటీల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ముఖ్యంగా యశోద సినిమా గురించి మాట్లాడుతూ యశోద సినిమా సరోగసి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా సరోగసి విధానం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి దీనిపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ… సరోగసి అనేది పెద్దగా కాంప్లికేట్ అయిన విషయం కాదు.ఎంతోమంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రుల అవుతున్నారంటే అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం దీని గురించి పెద్దగా ఇష్యూ చేయాల్సిన పనిలేదు అయితే చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు అంటే అందుకు కారణం వారు వారి గురించి ఆలోచించడం మానేశారని.

ఇలా సెలబ్రిటీలకు అభిమానులుగా ఉంటేవారు నటించిన సినిమా చూసి ఆనందపడాలి సినిమా నచ్చితే బాగుందనాలి లేకపోతే బాలేదని చెప్పాలి అంతేకానీ వారి వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకునే హక్కు ఎవరికీ లేదని ఈమె తెలిపారు.ఈ విధంగా ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే వారు పూర్తిగా వారి కార్యకలాపాలను పక్కనపెట్టి పని పాట లేక ఇతరుల జీవితాలలోకి తొంగి చూస్తే వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ ఈమె ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.