నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక, సమంత మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందన్న ప్రచారం పరమ రొటీన్ వ్యవహారమే అయిపోయింది. నాగ కూడా ఇంకోసారి పెళ్ళి పీటలెక్కబోతున్నాడంటూ గుగసుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే, నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణమైన ఓ వ్యక్తి, సమంతని పెళ్ళాడబోతున్నాడన్నది తాజా గాసిప్స్ సారాంశం. పేరేమో ప్రీతమ్ జుకాల్కర్. సమంతకి స్టైలిస్ట్ అలాగే డిజైనర్ కూడా.!
చాలాకాలంగా సమంత – ప్రీతమ్ మధ్య స్నేహం వుంది. నాగచైతన్య – సమంత మధ్య వైవాహిక బంధం వున్నప్పుడూ, ప్రీతమ్ – సమంత మధ్య స్నేహం అలాగే వుంది. ఆ స్నేహమే పరిధి దాటి, గొడవలకు కారణమయ్యిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ప్రీతమ్ – సమంత.. ఇద్దరూ తమ మధ్య ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదని చెబుతూ వస్తున్నారు. ఇదిలా వుంటే, తాజాగా సమంత తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంది. ఆమె వెంట ప్రీతమ్ కూడా వున్నాడు.
దాంతో, సమంత – ప్రీతమ్ పెళ్ళి పీటలెక్కబోతున్నారన్న పుకార్లు షికార్లు చేయడం షురూ అయ్యింది. ఈ వ్యవహారంపై సమంత ఇంకోసారి స్పందించాల్సి వుందా.? అంటే, అంతేనేమో.!
ఒకవేళ సమంత స్పందించినా, ఖండించినా.. ఈ గాసిప్స్ ఇంకోసారి వేడి వేడిగా వడ్డించబడుతూనే వుంటాయ్.