మహేష్‌నే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా.?

తెలుగు సినీ మీడియాలో వింత పోకడలు కనిపిస్తున్నాయి. అడిగినంత మొత్తం చెల్లిస్తే సరే సరి.! తూతూ మంత్రంగా నాలుగు పాజిటివ్ న్యూస్ ఆర్టికల్స్.. సినిమా రిలీజ్ టైమ్‌లో ప్రకటనలు.. ఇదీ ఓ ప్యాకేజీ.

లేని పక్షంలో, సినిమా మీద దుష్ప్రచారం. బాగా ఈ ట్రెండ్ నడుస్తోంది. కొందరు హీరోల విషయంలో పనిగట్టుకుని నెగెటివిటీ ప్రదర్శించడం సోకాల్డ్ తెలుగు సినీ మీడియాకి అలవాటే.

కానీ, ఈసారి మహేష్‌బాబు టార్గెట్ అయిపోయాడు. ఆయన మీద జుగుప్సాకరమైన కథనాల్ని అల్లారు. ఇదంతా మహేష్ కొత్త సినిమాని బ్లాక్‌మెయిల్ చేయడానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ అభిమానులు గట్టిగానే ఏసుకున్నారు. విషయం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, ఓ సినీ జర్నలిస్టు చుట్టూనే ‘బ్లాక్‌మెయిల్’ ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.