Akhanda : గుంటూరులో అఖండ ఇంకా ఆగలేదు… రోజుకు నాలుగు ఆటలతో కళకళలాడుతున్న సినిమా హాల్…!

Akhanda : బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన చిత్రం అఖండ. కరోనా తరువాత థియేటర్లకు మళ్ళీ జనాలను వచ్చేలా చేసిన చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు. ఊరి బాగోగులు చూసుకునే మురళి కృష్ణ గా ఒక బాలకృష్ణ, అఖండగా మరో బాలకృష్ణ గా బాలయ్యబాబు నటన అబ్బురపరిచింది.రెండు పాత్రాల్లోను వేరియేషన్స్ చూపిస్తూ దేనికదే అన్నట్టు పాత్రాలలో ఒదిగిపోయాడు బాలకృష్ణ.

ఇక జై బాలయ్య పాటలో డాన్స్, అఖండ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమా విడుదలయ్యాక రికార్డు కలెక్షన్స్ తో దుమ్ములేపింది. ఇక ఓటీటీ లో కూడా సంచలనం సృష్టించింది. ఇక ఓటీటీ లో కూడా వచ్చేసిన ఒక థియేటర్లో మాత్రం అఖండ సినిమా ఇంకా ఆడుతోంది అదికూడా రోజుకు నాలుగు ఆటలు. పైగా ప్రేక్షకులు వస్తూనే ఉండటంతో సినిమాను 175 రోజులు ఆడిస్తారట థియేటర్ యాజమాన్యం.

గతంలో సీడెడ్ ఏరియాలో బాలయ్య నటించిన ‘లెజెండ్’ కూడా ఇదే తరహాలో 100 రోజులు ఆడింది. ఇప్పుడు మళ్లీ ఆ క్రెడిట్ అఖండకే దక్కుతోంది. ఇక అఖండ 103 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 20కు పైగా సెంటర్లలో అఖండ 100 రోజులు పూర్తిచేసుకుంది. కర్నూలులో 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేశారు బాలయ్య అభిమానులు . ఇక ఈ సినిమాకు సీక్వేల్ ప్లాన్ లో వున్నారట దర్శకుడు బోయపాటి. సినిమా అఖండ పాపకి ఆపద వచ్చినపుడు మళ్ళీ వస్తాను అని చెప్తాడు ఇక మళ్ళీ పాపా ద్వారా అఖండా వచ్చే కథను సినిమాగా తీస్తారని టాక్ వినిపిస్తోంది.ఇక రెండో పార్ట్ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.