టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ఈ విధంగా విడాకుల తర్వాత సమంత తిరిగి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.
ఈ విధంగా వరుస సినిమాలతో కెరీర్లో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక పై ప్రేమ ద్వేషం లాంటి విషయాలలో మళ్లీ పడకుండా ఉండటం కోసం తాను ప్రయత్నిస్తానని, ఇకపై వాటికి దూరంగా ఉంటానని ఈమె చెప్పుకొచ్చారు. ఇలా సమంత ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్థాయిలో నటించిన శాకుంతలం, అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న యశోద సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా వరుస సినిమాలతో సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు.