రామ్ చరణ్ వల్ల మెగా ఇంటి కోడలయ్యే అవకాశం కోల్పోయిన స్టార్ హీరో కూతురు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఆ కుటుంబానికి పెద్దగా ఉంటూ అందరి మంచి చెడులు చూసుకుంటూ ఉంటాడు. ఇక మెగాస్టార్ కి ఇటు అక్కినేని ఫ్యామిలీతో అటు దగ్గుబాటి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. హీరో దగ్గుబాటి వెంకటేష్ , చిరంజీవిల మధ్య చాలా గొప్ప స్నేహబంధం ఉంది. వెంకటేష్ నటించిన ఎన్నో సినిమాలను చిరంజీవి ప్రమోట్ చేశాడు. అంతేకాకుండా వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చంటి సినిమాని చేయమని కూడా చిరంజీవి గారు సజెస్ట్ చేశారు.

ఇలా స్నేహితులుగా ఉన్న వీరి బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని వారి చిన్నతనంలో పెద్దలు అనుకున్నారు. కానీ రామ్ చరణ్ పెద్దయ్యాక చిరంజీవి ఈ విషయాన్ని రామ్ చరణ్ వద్ద ప్రస్తావించగా…తను ఉపాసనని ప్రేమించిన సంగతి బయట పెట్టాడు. దీంతో చిరంజీవి వెంకటేశ్ కి ఫోన్ చేసి రామ్ చరణ్,ఉపాసన ప్రేమ గురించి చెప్పగా..పిల్లల ఇష్టం కన్నా మనకు ఏది ముఖ్యం కాదు. వాళ్లకు నచ్చినట్లు వాళ్ళ లైఫ్ లో బ్రతకనిద్దామంటూ వెంకటేష్ కాంప్రమైజ్ అయ్యారట.

ఇలా రామ్ చరణ్ ఉపాసనని ప్రేమిస్తున్నానని చెప్పటంతో వెంకటేశ్ కూతురు మెగా ఇంటికి కోడలయ్యే అవకాశం కోల్పోయింది. ఇక ఆశ్రిత కూడా
రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి మనవడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు ఆశ్రిత దంపతులు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వారి అభిమానులు మాత్రం ఆశ్రిత మెగా ఇంటికి కోడలయ్యుంటే చాలా బాగుండేదని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.