నాగార్జున కోసం రష్మిక వస్తుందా.?

నాగార్జున తాజా ప్రాజెక్ట్ ‘నా సామిరంగా’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక మండన్నా గెస్ట్ రోల్‌లో కనిపించబోతుందట అన్నదే ఆ గాసిప్ సారాంశం.

అక్కినేని నాగార్జున, విజయ్ బిన్ని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నా సామిరంగా’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసి బోలెడంత ఆసక్తి క్రియేట్ చేశారు.

ఓ వైపు బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ రియాల్టీ షో చేస్తూనే నాగార్జున మరోవైపు ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఎట్ ఏ టైమ్ రెండు షూటింగ్‌లూ పూర్తి చేసేస్తున్నాడు నాగార్జున.

ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ ఫీమేల్ రోల్ క్రియేట్ చేశారట. ఆ రోల్‌లో రష్మికా మండన్నా అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ఆ దిశగా రష్మికతో సంప్రదింపులు కూడా చేశారట.

దాదాపు రష్మిక నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనీ సమాచారం. గతంలో నాగార్జున నటించిన ‘దేవదాస్’ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించింది.

అయితే, మల్టీ స్టారర్ సినిమాగా వచ్చిన ఆ సినిమాలో నేచురల్ స్టార్ నానికి జోడీగా రష్మిక మండన్నా నటించింది. మరి, ఇప్పుడు ఏ తరహా రోల్‌లో రష్మిక కనిపించబోతోందో కానీ, చాలా సర్‌ప్రైజింగ్ రోల్ అనీ గుసగుసలాడుకుంటున్నారు.

తెలుగులో ‘పుష్ప 2’ సినిమాలో రష్మిక నటిస్తోంది ప్రస్తుతం. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొత్త ప్రాజెక్టులకి రష్మిక సైన్ చేయడం లేదు. అయితే, గెస్ట్ రోలే కాబట్టి, నాగార్జున సినిమా కోసం రెండు మూడు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోవచ్చు. అందుకే ఓకే చెప్పిందేమో. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.