నాగచైతన్య కంటే సమంత ఆస్తులే ఎక్కువా.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే?

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అప్పటినుంచి ఇప్పటివరకు తన సినిమాలతో, నటనతో ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉన్నారు. అటు అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథ నచ్చితే బోల్డ్ సీన్స్ లో కూడా నటించడానికి సిద్ధమేనని సమంత వెల్లడిస్తున్నారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు కావడం గమనార్హం.

తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన సమంత మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ సమంత తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. సినిమాల ద్వారా చైతన్య సంపాదించిన మొత్తంతో పోల్చి చూస్తే సమంత సంపాదించిన మొత్తమే ఎక్కువని తెలుస్తోంది.

సమంత నటించిన సినిమాలలో చాలా సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోవడం గమనార్హం. ఓ బేబీ, ఫ్యామిలీ మేన్2 ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న సమంత సామ్ జామ్ షోకు హోస్ట్ గా మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే ఈ షో ఆహా ఓటీటీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నాగచైతన్య ఆస్తుల విలువ 38 కోట్ల రూపాయలు కాగా సమంత ఆస్తుల విలువ 84 కోట్ల రూపాయలు అని సమాచారం.

తక్కువ వయస్సులోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకోవడంతో సమంత ఈ స్థాయిలో సంపాదించారని తెలుస్తోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ల ద్వారా కూడా సమంత బాగానే సంపాదిస్తున్నారని సమాచారం. సమంత వయస్సు పెరుగుతున్నా క్రేజ్ తగ్గకపోవడంతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.