బాలయ్య తనయుడి సరసన శ్రీలీల.!

ఆలు లేదు చూలు లేదు.. అల్లుడి పేరు డాష్ అన్నట్లుగా ఇంకా మోక్షజ్ఞ తెరంగేట్రం ముచ్చట ఓ కొలిక్కి రానే లేదు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మూవీలో హీరోయిన్ శ్రీలీల అంటూ ప్రచారం జోరందుకుంది.

ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన మోక్షజ్ఞ ఫోటోలను బట్టి, త్వరలోనే తెరంగేట్రం వుండబోతోందనీ వేడి వేడిగా కథనాలు వెలువడ్డాయి. అలాగే, ఫ్యాన్స్ కూడా దాదాపు ఫిక్సయిపోయారు. బోయపాటి శీను కానీ, అనిల్ రావిపూడి కానీ మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నారన్న ప్రచారం కూడా వుంది.

తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ కూడా మంచి కథతో బాలయ్యను సంప్రదించాడట. ఆ కథ కూడా బాలయ్యకు నచ్చిందనీ తెలుస్తోంది. సో, ఈ డైరెక్టర్ కూడా లిస్టులోనే వున్నాడు.

డైరెక్టర్ ఎవరైనా కానీ, హీరోయిన్ మాత్రం శ్రీలీలే అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల, బాలయ్యతో ‘భగవంత్ కేసరి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్టర్.