పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’కు అదనపు గ్లామర్ అద్దే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ వున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ త్రిషను ఈ సినిమాలో భాగం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘బంగారం’, ‘తీన్‌మార్’ సినిమాల్లో త్రిష నటించింది.
అప్పటితో పోల్చితే, ఇప్పుడు.. ‘పొన్నియన్ సెల్వన్ 1’ తర్వాత త్రిష ఇమేజ్ బాగా పెరిగింది. ఆ ఇమేజ్‌ని ‘హరి హర వీరమల్లు’కి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట.
నిర్మాత ఎ.ఎం.రత్నం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనీ అంటున్నారు. దాంతో, ఈ సినిమాలో త్రిష కోసం ఓ స్పెషల్ రోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారట.
ఆల్రెడీ ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రలతో తమదైన గ్లామర్ పంచేందుకు రెడీగా వున్నారు.
ఇక, తాజాగా త్రిష గ్లామర్ కూడా యాడ్ అయితే, ‘హరి హర వీరమల్లు’ రేంజ్ పెరిగినట్లే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.