జక్కన్న రాజమౌళి సినిమాలని అద్భుతంగా చెక్కి ప్రజలని తన క్రియేటివిటీతో మెప్పించడమే కాకుండా వ్యక్తిత్వంతో కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అతను చేసే పనులు ఒక్కోసారి ప్రజలని ఆలోచింపచేస్తూ ఉంటాయి. సెలబ్రిటీ ఇన్ ఫ్య్లూయెన్సర్ కావడం కచ్చితంగా రాజమౌళి చేసే పనిని ఎంతో కొంత మంది ఫాలో అవ్వడానికి ఇష్టపడతారు.
అందుకే జక్కన్న సోషల్ యాక్టివిటీస్ లో భాగం అవుతూ ఉంటారు. షూటింగ్ లు లేని సమయంలో ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో తన టైమ్ చూసుకొని పాల్గొంటారు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందికి స్పూర్తినిచ్చే విధంగా ఉంది. తొండుపల్లి-కొత్తూరు మధ్య బెంగుళూరు హైవేపై రోడ్డు విస్తరణ కోసం చెట్లను తొలగించారు.
తొలగించిన చెట్లను రక్షించేందుకు వాత ఫౌండేషన్ సిద్ధమైంది. వీరితో రాజమౌళి చేయి కలిపారు. ఆ చెట్లని తన తన ఫామ్ హౌస్ కి రాజమౌళి తరలించి వాటిని మళ్ళీ నాటించారు. చౌటప్పల్ లో ఉన్న ఫామ్ హౌస్ లో 20 చెట్లకి తిరిగి ప్రాణం పోశారు. మరో 15 చెట్లని ఇంకోచోటకి తరలించారు. ఈ విషయాన్ని ఎంపీ సంతోష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజమౌళి ముందుకొచ్చి చెట్లని సంరక్షించే బాద్యత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ జక్కన్నపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
జక్కన్న సినిమాలు సృష్టించడంలోనే కాకుండా ఇలా చెట్లని సంరక్షించడంలో కూడా భాగం కావడం గొప్ప విషయం అని కొనియాడుతున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై ఫోకస్ చేశారు. ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ప్రకృతి ప్రాధాన్యతని ఈ చిత్రంలో చెప్పే అవకాశం ఉందని టాక్. ఈ ఏడాది ఆఖరులో ఈ మూవీకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.