రాజమౌళి లెక్క ఈసారి అస్సలు తప్పదట.!

దర్శక ధీరుడు రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్‌బాబుతో అనేది అందరికీ తెలిసిన విషయమే కదా.! లుక్ టెస్ట్ ఇప్పటికే జరిగిందనే ప్రచారం కూడా వుంది. అయితే, సినిమా ప్రారంభానికి ముందు అన్ని విషయాలపైనా గోప్యత ప్రదర్శించడం రాజమౌళి ట్రేడ్ మార్క్.

సినిమా ప్రారంభమైన రోజున టైటిల్ సహా చాలా విషయాల్ని చెప్పేస్తుంటాడు. గ్లోబ్ ట్రోటింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించేశాడు. కాగా, సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తాడనీ, ఇంకోటనీ బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, మహేష్ – రాజమౌళి కాంబినేషన్ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోందన్నది తాజా ఖబర్. ఆ డేట్ ఎప్పుడన్నది త్వరలోనే డిసైడ్ చేస్తారట. ఈలోగా ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు.

నటీనటులు, సినిమా టైటిల్.. ఇలా అన్ని విషయాలపైనా ఒకేసారి స్పష్టత రాబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. పనిలో పనిగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారట.

కోవిడ్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ విషయంలో కొంత వాయిదాల పర్వం నడిచిన మాట వాస్తవం. మహేష్ సినిమాకి మాత్రం ‘వాయిదా’ సమస్యే వుండదని తెలుస్తోంది. అంత పక్కాగా, వీఎఫ్ఎక్స్ వంటి వ్యవహారాల్నీ సైమల్టేనియస్‌గా రాజమౌళి పూర్తి చేసెయ్యనున్నాడని తెలుస్తోంది.