రాజమౌళి చెప్పిన కారణం తో మీరు ఏకీభవిస్తారా ?

SS Rajamouli gives the reason for not donating plasma

బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా రాగానే ఆయన వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. ఇక.. తన సినిమా ఆర్ఆర్ఆర్ మీద దృష్టి పెట్టారు.

SS Rajamouli gives the reason for not donating plasma
SS Rajamouli gives the reason for not donating plasma

అయితే.. రాజమౌళితో పాటుగా తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. దీంతో అందరూ కరోనా ట్రీట్ మెంట్ తీసుకొని కరోనా బారి నుంచి తప్పించుకున్నారు.

అయితే.. కరోనా వచ్చి తగ్గిన వాళ్లలో యాంటీ బాడీస్ విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. అటువంటి వాళ్ల రక్తం నుంచి తీసిన ప్లాస్మాను కరోనా రోగులకు ఇస్తే కరోనా త్వరగా నయం అవుతుంది.

అందుకే చాలామంది కరోనా పేషెంట్లు ప్లాస్మా డోనర్ల కోసం వెతుకుతున్నారు. కరోనా రాగానే.. కరోనాను జయించి.. మేము కూడా ప్లాస్మా డొనేట్ చేస్తామని రాజమౌళి, కీరవాణి ముందే చెప్పారు.

అయితే.. తాజాగా కీరవాణి, ఆయన కొడుకు కాలభైరవ ఇద్దరు మాత్రమే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. రాజమౌళి మాత్రం తన ప్లాస్మాను దానం చేయలేదు.

తను ప్లాస్మా దానం చేయకపోవడానికి గల కారణాన్ని చెబుతూ రాజమౌళి ట్వీట్ చేశారు. యాంటీ బాడీస్ కోసం నాకు టెస్ట్ చేశారు. నా ఐజీజీ లేవల్స్ 8.62 మాత్రమే ఉన్నాయి. అవి కనీసం 15 అయినా ఉంటేనే ప్లాస్మా డొనేట్ చేయడానికి అర్హులు అవుతారు. పెద్దన్న, బైరవ ఇద్దరికి 15 కన్నా ఎక్కువగా ఉండటంతో వాళ్లిద్దరు ప్లాస్మా దానం చేశారు.. అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్లు బిజీగా ఉన్నారు. సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక.. కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.