ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్ రెడీ అయ్యారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్లు ఇండియన్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాని చిత్రీకరించారు.
ఈ సినిమాలో బన్నీ చేసిన పుష్ప రాజ్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో రష్మిక చేసిన శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను అంతే మెస్మరైజ్ చేసింది. అయితే ట్రైలర్ లోని ఒక షాట్ లో ఎర్రచందనంతో అంత్యక్రియలు చేయటం చూపించారు. ఇది చూసిన ప్రేక్షకులు శ్రీవల్లి చనిపోతుందా అనే ఒక సందిగ్ధంలో పడ్డారు. అక్కడ అంతక్రియలు జరుగుతున్నది శ్రీవల్లి కా లేదంటే పుష్పరాజ్ ఆప్తులకా అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకి ఏర్పడింది.
అయితే ఇదే విషయంపై ఇప్పుడు అనేక రూమర్స్ పుట్టుకొని వచ్చేస్తున్నాయి. పుష్పరాజ్ మీద కోపంతో ఉన్న విలన్స్ అతనిని ఏమి చేయలేక అతని భార్య శ్రీవల్లిని చంపేస్తారని, అక్కడ నుంచి మూవీ మరో టర్నింగ్ తీసుకుంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప టు సినిమా రిలీజ్ అయితే గాని అసలు విషయం తెలియదు. అయితే పుష్ప 1 లో పుష్పరాజ్ కి ప్రియురాలుగా నటించిన రష్మిక పుష్ప 2 లో అతని భార్యగా నటించిన రష్మిక పుష్ప 3 లో నటిస్తుందా, పుష్ప 2 లో రష్మిక చనిపోతే పుష్ప 3లో హీరోయిన్ గా నటించేది ఎవరు అంటూ రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
అయితే ఒక సందర్భంలో పుష్ప 3 అనేది పుష్ప 2 యొక్క రిజల్ట్స్ ని బట్టి ఉంటుందని నిర్మాతలు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయినా పుష్ప 3 సినిమా తీయటానికి మరొక మూడు సంవత్సరాలు సమయం పడుతుంది, అప్పటికి రష్మిక క్రేజ్ ఎలా ఉంటుందో, లేదంటే అప్పటికి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ని సినిమాలోకి తీసుకుంటారో వేచి చూడాల్సిందే.