ఐకాన్ స్టార్ కు కానుకలు పంపిన శ్రీవల్లి.. ఏం పంపిందో తెలుసా?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇకపోతే ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో డీగ్లామర్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఊహించని విధంగా కానుకలు పంపించారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రష్మిక పంపించిన కానుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక శ్రీవల్లి ఎలాంటి కానుకలు పంపించారనే విషయానికి వస్తే.. రష్మిక కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులను ఒక బాక్స్ లో పెట్టి చేతితో రాసిన ఒక నోట్ కూడా పంపించారు. ఇక ఆ నోట్ లో మీకు ఏదో ఒకటి పంపించాలని అనిపించింది సార్. పుష్ప సినిమా త్వరలోనే రానున్న నేపథ్యంలో చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రేమతో రష్మిక అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ లెటర్ బట్టి చూస్తుంటే పుష్ప సినిమా కోసం ఏవైనా ఉపయోగించిన కొన్ని వస్తువులను అల్లు అర్జున్ కు కానుకగా పంపినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక పంపించిన కానుకలకు సంబంధించిన ఫోటో తీసి అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ తనకు కానుకలు పంపించినందుకు రష్మికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అల్లుఅర్జున్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మొదటి పార్ట్ డిసెంబర్ 17వ తేదీ రావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.