సుకుమార్ శిష్యులా మజాకా..

టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా, క్రియేటివ్ జీనియస్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సుకుమార్. అతని ప్రతి సినిమా కూడా డైరెక్టర్స్ కి ఒక లెసన్ వంటిది అనే మాట వినిపిస్తుంది. ఎవరైనా దర్శకులు కావాలని అనుకుంటే మాత్రం సుకుమార్ సినిమాలు రిఫరెన్స్ గా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఈ జెనరేషన్ బెస్ట్ డైరెక్టర్స్ లో అతను కూడా ఒకడు.

స్వయంగా రాజమౌళి సైతం ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం. సుకుమార్ కమర్షియల్ సినిమాలు చేసి ఉంటే ఎప్పుడో మమ్మల్ని బీట్ చేసేసేవాడు అని ప్రశంసించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో సుకుమార్ టీమ్ నుంచి వస్తున్న దర్శకులు సక్సెస్ ఫుల్ ట్రాక్స్ రికార్డ్ ని క్రియేట్ చేస్తూ ఉండటం. కొంత మంది దర్శకుల టీమ్ నుంచి వచ్చే కొత్త డైరెక్టర్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఒకప్పుడు డైరెక్టర్ సాగర్ దగ్గర అసిస్టెంట్ లుగా పనిచేసిన చాలా మంది టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా మారారు. స్టార్ దర్శకులుగా ఉన్న చాలా మంది అతని దగ్గరి నుంచి వచ్చినవారే. రాఘవేంద్రరావు శిష్యుడిగా వచ్చిన రాజమౌళి నెంబర్ వన్ దర్శకుడు అయ్యాడు. ఆ స్థాయిలో ఇంకెవరు లేరు. అయితే సుకుమార్ శిష్యులుగా పరిచయం అవుతున్న దర్శకులు అందరూ కూడా ఎంట్రీతోనే సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు.

సుకుమార్ టీమ్ నుంచి ముందుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా కుమారి 21ఎఫ్ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మరల అదే దర్శకుడు రీసెంట్ గా 18 పేజెస్ మూవీతో మరో హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ శిష్యుడిగా వచ్చిన బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా ఉప్పెన మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తాజాగా దసరా మూవీతో శ్రీకాంత్ ఒదేల సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వంద కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇక వచ్చేనెలలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విరూపాక్ష మూవీతో కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆ మూవీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లుగా టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటికే విరూపాక్ష మూవీపై పాజిటివ్ టాక్ ఉంది. హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో సాయి తేజ్ కూడా ఉన్నాడు. మరి అది హిట్ అయితే సుకుమార్ శిష్యుల రికార్డ్స్ పరంపర కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి.