కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద లాంటి సినిమాలతో క్లాస్ డైరెక్టర్ గా శ్రీకాంత్ అడ్డాల పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి హాయిగా చూడగలిగే కథలు తీస్తాడనే పేరు ఉంది. అయితే ఇతనికి బ్రహ్మోత్సవం మూవీ పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బకి చాలా కాలం కనిపించకుండా పోయారు. మరల వెంకటేష్ తో నారప్ప మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి కరెక్ట్ గా సింక్ చేసి అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ చిత్రం తర్వాత మరల లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం పెద్ద కాపు 1 మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. క్యాస్ట్ పొలిటిక్స్, గ్రామాలలో ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.
ఈ టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చినపుడు ఇచ్చిన స్పీచ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. విజువల్స్ లో ఒక పెద్ద చెట్టు దుంగని పట్టుకొని కొంతమంది నడుచుకుంటూ వెళ్ళడం చూపించారు. ఊరిలో మరికొంత మందిని బ్రతికుండగానే గోతిలో వేసి పాతేస్తున్న దృశ్యాలు చూపించారు. ఏ ఊరికైనా నాలుగు దిక్కులు ఉంటాయి.
కాని ఈ ఊరికి రెండే దిక్కులు ఒకటి సత్య రంగయ్య, రెండోది బయన్న అంటూ తనికెళ్ళ భరణి హీరోగా చెప్పడం, రావు రమేష్, నరేన్ ని విలన్ గా రిప్రజెంట్ చేశారు. ఎవరైనా సరే ఈ రెండు దిక్కులలో పడి చావాల్సిందే అంటూ వారి క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో చెబుతాడు. వారిని ఎదిరించే పెదకాపుగా హీరోగాని చూపించారు. ఆల్లు పెట్టిన జెండా చూడాలంటే కచ్చితంగా తలెత్తి చూడాలి అని నాగబాబు చెప్పిన డైలాగ్ తో కథలో మరో యాంగిల్ ని ఆవిష్కరించారు.
పెదకాపుకి టికెట్ ఇస్తామని ఎవరో ఫోన్ చేస్తారు. మీరు ఇప్పించండి సార్ మేము నెగ్గించుకుంటాం అనే డైలాగ్ తో వారిద్దరి మధ్యలో మూడో వ్యక్తిగా హీరో నిలబడబోతున్నాడు అని చూపించారు. టీజర్ లో మొత్తం గ్రామంలో జరిగే కొట్లాటలు, రెండు కులాల మధ్య నిలిగిపోయే జనం. వారిలో పుట్టుకొచ్చే పెద్ద కాపుగా హీరో కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల నుంచి అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని మూవీ ఇదని చెప్పొచ్చు.
అలాగే క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మిక్కీ జె మియర్ సంగీతం కూడా పవర్ ఫుల్ మాస్ ఎలివేషన్స్ తో నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాలలో కులాల మధ్య ఆధిపత్య పోరుతో ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరిస్తున్నట్లు టీజర్ బట్టి అర్ధమవుతోంది. మరి అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.