సారధిలో డాల్బీ మిక్సింగ్‌ స్టూడియో!

హైదరాబాద్‌ కీర్తిలో మరో అద్భుతం చోటుచేసుకోబోతోంది. విజువల్‌ రంగంలో ఓ వండర్‌ ఆవిష్కృతం కాబోతున్నది. హైదరాబాద్‌లోని శ్రీ సారధి స్డూడియోలో సాంకేతికంగా సరికొత్త హంగులతో ఏర్పాటు చేసిన డాల్బీ మిక్సింగ్‌ స్టూడియో ఈ శుక్రవారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ స్టూడియోను ప్రభాస్‌ కల్కి సినిమా కోసం ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమానికి కీరవాణి, నిర్మాతలు కె.ఎల్‌ నారాయణ, దామోదర ప్రసాద్‌ , కె.ఎస్‌ రామారావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి స్టూడియోను ప్రారంభించారు.