‘త్రిబుల్ ఆర్’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘కొమరం భీం’గా అద్భుత నటన కనబర్చి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాబితాలో క్రికెటర్స్ కూడా ఉన్నారు.
తాజాగా మరో క్రికెటర్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజా ఇంటర్వ్యూలో. జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూ తాజా ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఈ మేరకు శ్రీశాంత్ మాట్లాడుతూ..’ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. గతంలో ఒకసారి నేను ఎన్టీఆర్ ని కలిసాను. ఆ సమయంలో ఆయనతో మాట్లాడాను. మీరు బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాను. దానికి ఆయన థాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ప్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ని చూస్తే ఎంతో మోటివేట్ గా ఉంటుంది.
నేను ఎన్టీఆర్ ని కలిసిన ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు ఇండియన్ బెస్ట్ బౌలర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 2017లో సినీ ఆరంగేట్రం చేశాడు. ‘అక్సర్ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సౌత్ సినిమాల్లో నటించాడు. చివరగా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కొన్ని సౌత్ సినిమాల్లో నటిస్తున్నాడు.