పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఓ సెల్ఫీ దిగాలని ఎంతో మంది ముచ్చటపడుతుంటారు. కొందరైతే దాన్నే జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. ఇలాంటి ఆశలు సాధారణ జనాలకే కాదు.. చిన్న పాటి సెలెబ్రిటీలకు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలని ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కూడా కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అది జరిగినప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్‌ను మాటల్లో వర్ణించలేరు కూడా.
తాజాగా శ్రీముఖి కూడా అలాంటి ఓ పరిస్థితిలోనే ఉంది. తాజాగా శ్రీముఖి వకీల్ సాబ్ గెటప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌తో ఓ సెల్పీ దిగింది. ఆ ఫోటోలను వెంటనే శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే శ్రీముఖికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్ ఫినాలే స్టేజ్ మీద గెస్ట్‌గా వచ్చిన చిరంజీవిని శ్రీ ముఖి ఏకంగా ముద్దు పెట్టుకుని అందర్నీ షాక్‌కు గురి చేసింది.
ఆరాధ్య దైవాలను, అభిమాన హీరోలను చూసినప్పుడు ఎగ్జైట్మెంట్‌లో అలాంటి ఘటనలే జరగుతాయి. తాజాగా శ్రీముఖి పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్లతో తన ప్రేమను చూపెట్టింది. ఇంత కంటే ఎక్కువగా ఏం టైప్ చేయాలో అర్థం కావడం లేదు అంటూ లవ్ లవ్ లవ్ అని పేర్కొంది. శ్రీముఖి ఎంత సంతోషంగా ఉందే ఆమె కళ్లను, మొహాన్ని చూస్తేనే తెలిసిపోతోంది. మొత్తానికి మరోసారి వకీల్ సాబ్ లుక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతునన్నారు.