బాలయ్య, శ్రీలీల కాంబినేషన్‌ ఇంకోస్సారి.!

‘భగవంత్ కేసరి’ కోసం బాలయ్య, శ్రీలీల… ఆన్ స్క్రీన్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీ కూతుళ్లలా ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీల నటిస్తున్నారు.

ఇదో సీరియస్ మాస్ మూవీ అన్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలీల కాంబోతో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా వస్తున్నాయట.

ఆయా సీన్లు ధియేటర్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని అనిల్ రావిపూడి అండ్ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాంబినేషన్‌ని అలా చూస్తున్న అనిల్ రావిపూడికి మరో ఐడియా వచ్చిందట. అదే, ఇంకోసారి ఈ కాంబినేషన్ వర్కవుట్ చేయాలని.

ఈ సారి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా అటు బాలయ్య అభిమానుల్నే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా వుంటుందంటున్నాడు అనిల్ రావిపూడి.

ఆ దిశగా ఆల్రెడీ కథ కూడా సిద్ధం చేయమని టీమ్‌కి సూచించాడట. దాదాపు ఆ స్టోరీ లైన్ ఓ కొలిక్కి వచ్చిందనీ తాజా సమాచారం.

త్వరలో ‘భగవంత్ కేసరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ కాంబినేషన్‌లో నయా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయబోతున్నాడట. పూర్తి వివరాలు తెలియాలంటే అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.