అలాంటివి వద్దంటున్న శ్రీలీల.!

నటి అన్నాక భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాలి.! కానీ, అలా అందరూ అనుకోరు కదా.! కొందరేమో, కేవలం బబ్లీ రోల్స్‌కే పరిమితమవుతారు. కొందరు మాత్రం, భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటారు. ఛాలెంజింగ్ రోల్స్‌లో మెప్పించాలనుకుంటారు.

అసలు విషయానికొస్తే, తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల, రిస్క్ చేయడానికి అస్సలు ఇష్టపడటంలేదట.

ఏదో అనుకోకుండా, ‘భగవంత్ కేసరి’ సినిమాలో డిఫరెంట్ రోల్‌కి ఓకే చెప్పేసిన శ్రీలీల, ఆ తర్వాత మాత్రం చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘రిస్కీ అటెంప్ట్స్’ చేయనంటూ ఖరాఖండీగా చెప్పేస్తోందిట.

తాజాగా, ఓ యంగ్ డైరెక్టర్.. ఓ డిఫరెంట్ స్టోరీతో శ్రీలీలని అప్రోచ్ అయితే, ‘ఇప్పుడైతే అలాంటివి చేయలేను’ అని తెగేసి చెప్పేసిందట. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆ కథ రాసుకున్నాడనీ, కథ దాదాపుగా లేడీ ఓరియెంటెడ్ తరహాలో వుంటుందనీ, అందుకే శ్రీలీల ఆ సినిమాకి ‘నో’ చెప్పిందనీ అంటున్నారు.

‘చేస్తున్న సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా వుండడం వల్లే, కొన్ని సినిమాల్ని శ్రీలీల వదులుకోవాల్సి వస్తోంది తప్ప, వేరే కారణాలేం లేవు..’ అని శ్రీలీల తరఫున, ఈ తరహా గాసిప్స్‌పై ఖండన ప్రకటనలు వస్తున్నాయ్.!